బీఆర్ఎస్ (BRS Party)తో పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పండి అని రాహుల్ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. పొత్తు కొనసాగుతుందని ప్రచారం చేస్తూ బీజేపీ కుట్ర రాజకీయం చేస్తోందని, దానితో లబ్ధి పొందాలని చూస్తోందని వివరించారు.
కోరుట్ల (Korutla) ప్రభుత్వ ఆస్పత్రిలో వింత ఘటన చోటుచేసుకుంది. (Nizamabad) లోని ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ ఇవాళ తెల్లవారుజామున మగబిడ్డకు జన్మనివ్వగా.. శిశువు చేతులు, కాళ్లకు మొత్తం కలిపి 24 వేళ్లు (24 fingers) ఉన్నాయి ఇలా ఆరు వేళ్లతో జన్మించిన పిల్లలు పుట్టడం అత్యంత అరుదుగా జరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలా ఆరు వేళ్లతో పుట్టిన శిశువును చూసేందుకు స్...
తీన్మార్ మల్లన్న (Tinmar Mallanna) చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. గత నెల 21న పలు సెక్షన్ల కింద మేడిపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సాయి కిరణ్ గౌడ్ (Saikiran goud)కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ మల్కాజ్ గిరి కోర్టు (Malkjagiri court) సోమవారం తుది తీర్పు ఇచ్చింది. మల్లన్నతో పాటు అరెస్ట్ అయిన మిగతా నలుగురికి సైతం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి మతి పోయిందని, నేరస్థుడైనా సర్పంచ్(Surpunch)ని కలిసినవ్ కానీ బాధిత మహిళను కనీసం పరామర్శించలేదంటూ ఆయన ఈటలపై విమర్శలు గుప్పించారు.
ఇటీవల మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన BRS ఆత్మీయ సమ్మేళనం సభలో రసాభాస చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి మల్లా రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ క్రమంలో ఏకంగా స్టేజ్ పైనే గొడవకు దిగారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మంచి పనితీరు కనబర్చిన గ్రామ పంచాయతీలకు ‘దీన్‌దయాల్ ఉపాధ్యాయ (Deendayal Upadhyay) పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’, ‘నానాజీ దేశ్‌ముఖ్(Nanaji Deshmukh) సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2023’ పేరుతో పురస్కారాలను అందజేసింది. ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్(Vigyan Bhavan) లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు సర్వీసులో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది ఎంజీబీఎస్ (MGBS), జేబీఎస్ మార్గంలో మార్గంలో వెళ్తున్న రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ రైలు నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగాయి. దీంతో మెట్రో సర్వీసుల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు (Passengers) ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ (Hyderabad) లో రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద నైట్ బజార్ నడుస్తుంది. రంగురంగుల బట్టలు, గాజుల గలగలలు, రకరకాల ఫుడ్ టేస్ట్ లతో పాటుగా హలీం తింటూ నైట్ బజార్ ని ఎంజాయ్ చేస్తారు. కేవలం రంజాన్ (Ramadan) ఉపవాస దీక్షలు చేస్తూ ఉండే ముస్లిమ్స్ మాత్రమే కాదు హైదరాబాద్ వాసులు కూడా నైట్ బజార్ కి క్యూ కడుతూ అక్కడ సందడి చెయ్యడమే కాదు.. సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియా(Social media)లో నైట్ బజార్ హంగామని ...
అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ మధురంగా ఉంటాయి. చిన్నప్పటి డ్రెస్సింగ్ స్టైల్, హెయిల్ స్టైల్ (Hair style) తిరిగి ఇప్పుడు ఫోటోల్లో చూసుకుంటే మనమేనా? అనిపిస్తాయి. మంత్రి కేటీఆర్ (KTR) గారు తన చిన్ననాటి ఫోటో ఒకటి ట్విటర్‌లో షేర్ చేశారు. అప్పటి తన హెయిర్ అండ్ స్టైల్ అంటూ పోస్ట్ చేసిన ఫోటోకి ట్విటర్‌లో అనూహ్య స్పందన వస్తోంది.
ఏపీ నేతలు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సహా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట కలిగింది. సీబీఐ విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు సమాచారం ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజన్నపేట (Rajannapet)గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతి కార్యాలయాన్ని ప్రారంభించారు.
తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఇటీవల హరీశ్ చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రుల కామెంట్స్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా ఉన్నాయని పవన్ అంటున్నారు.