»Ntrs Wife Pranathi Shopping At Charminar Photo Viral
Night Bazaar : చార్మినార్ వద్ద ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి షాపింగ్.. ఫోటో వైరల్!
హైదరాబాద్ (Hyderabad) లో రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద నైట్ బజార్ నడుస్తుంది. రంగురంగుల బట్టలు, గాజుల గలగలలు, రకరకాల ఫుడ్ టేస్ట్ లతో పాటుగా హలీం తింటూ నైట్ బజార్ ని ఎంజాయ్ చేస్తారు. కేవలం రంజాన్ (Ramadan) ఉపవాస దీక్షలు చేస్తూ ఉండే ముస్లిమ్స్ మాత్రమే కాదు హైదరాబాద్ వాసులు కూడా నైట్ బజార్ కి క్యూ కడుతూ అక్కడ సందడి చెయ్యడమే కాదు.. సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియా(Social media)లో నైట్ బజార్ హంగామని ఎంజాయ్ చేస్తున్నారు.
రంజాన్ (Ramadan) మాసం కావడంతో హైదరాబాద్ చార్మినార్ (Charminar) వద్ద సందడి మొదలైంది. నైట్ బజార్లో షాపింగ్ (Shopping) చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సతీమణి (Lakshmi Pranathi) కూడా నైట్ బజార్ షాపింగ్ కి వచ్చింది. చార్మినార్ వద్ద ఆమెను గుర్తించిన అభిమానులు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ప్రణతి వెనుక ఇద్దరు బాడీగార్డ్స్ కూడా కనిపిస్తున్నారు. స్టార్ హీరో వైఫ్ అయ్యుండి ఇలా సింపుల్ గా చార్మినార్ దగ్గర షాపింగ్ చేస్తూ కనిపించడంతో నెటిజెన్లు ఆమె సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటున్నారు. టాలీవుడ్ (Tollywood) లో మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ భార్యలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటారు. తమ కుటుంబం మరియు భర్తకి సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ (NTR) భార్య లక్ష్మి ప్రణతి (Lakshmi Pranathi) సోషల్ మీడియాలో కనిపించదు.
ఎన్టీఆర్ (NTR) కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను చాలా అరుదుగా షేర్ చేస్తుంటాడు. తాజాగా ప్రణతికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి బయట పెద్దగా కనిపించదు. తాజాగా ఈమె చార్మినార్ వద్ద షాపింగ్ చేస్తూ కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి షాపింగ్ చేస్తూ కనిపించడంతో వదినమ్మ లక్ష్మి ప్రణతి అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఉత్సాహంగా ఆ పిక్ ని ట్రెండ్ చేస్తున్నారు. అయితే నిజంగానే లక్ష్మి ప్రణతి చార్మినార్ లో నైట్ బజార్ (Night Bazaar) లో కనిపించినట్లుగా.. ఈపిక్ ఎన్టీఆర్ ఫాన్స్ కి ఎక్కడ దొరికిందో కానీ తెగ ట్రెండ్ చేస్తున్నారు. డిసెంబర్ లో పిల్లలతో సహా ఒక నెలపాటు భర్త ఎన్టీఆర్ తో అమెరికాలో ఎంజాయ్ చేసిన ప్రణతి.. తర్వాత ఆస్కార్ అప్పుడు కూడా అమెరికా(America)వెళుతుంది అనుకున్నారు. కానీ పిల్లలని చూసుకోవాల్సి ఉంది అందుకే ఆమె రాలేదంటూ ఎన్టీఆర్ తన ఫాన్స్ ని నిరుత్సాహపరిచారు.