• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గజ్వేల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

SDPT: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్డు రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టగా, 20 మంది ప్రయాణికులకు గాయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:27 AM IST

రాష్ట్రస్థాయి పోటీలకు చిత్వాన్ ఎంపిక

SDPT: అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లికి చెందిన విద్యార్థి చిత్వాన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా, మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చాటిన చిత్వాన్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంలో పీఈటీ వెంకట నర్సయ్య కృషి విశేషమని పేర్కొన్నారు.

February 22, 2026 / 09:25 AM IST

అటవీలో సాగుకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్

ASF: తీర్యాని మండల రిజర్వ్ అటవీలో చెట్లను నరికి సాగుకు ప్రయత్నించిన వ్యక్తిని అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. FRO శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మొర్రిగూడకు చెందిన ఆత్రం గంగు అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 13 రోజుల రిమాండ్ విధించారన్నారు. అటవీ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

February 22, 2026 / 09:20 AM IST

బడంపేట జాతరకు స్పెషల్ బస్సు సౌకర్యం

SRD: జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోహిర్ మండలం బడంపేట రాచన్న స్వామి జాతరకు స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం భక్తుల ప్రయాణ సౌకర్యార్థం బస్సును ప్రారంభించారు. ఈ స్పెషల్ బస్సును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ప్రయాణికుల రద్దీ అనుసరించి రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు.

February 22, 2026 / 09:18 AM IST

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవం

KNR: మానకొండూర్ మండలం రంగంపేటలో శ్రీ మేడలంబ కేతకాంబ సమేత మల్లికార్జున స్వామి నూతన దేవాలయం ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 09:16 AM IST

ఉద్యోగం రాక యువకుడి బలవన్మరణం

MNCL: ఉద్యోగం రావట్లేదని మనస్థాపం చెంది ఓ నిరుద్యోగి ఈ నెల 19న ఘటన చెన్నూర్‌లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటబొగూడకి చెందిన కిరణ్ డిగ్రీ పూర్తి చేసి HYDలో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్-2, 3, 4 పరీక్షలు రాసినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో తన తల్లికి భారం కాకూడదని వేదన చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు.

February 22, 2026 / 09:15 AM IST

‘ఆర్గానిక్ పంటలను సందర్శించండి’

BDK: మణుగూరు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆర్గానిక్ పంటల సాగు ద్వారా గుర్తింపు పొందిన ఆదర్శ రైతులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్గానిక్ పంటల సాగు పండించే విధానం, పంటల దిగుబడి తద్వారా పొందే మెరుగైన ఫలితాలు, వాటి ఉపయోగాలు వంటి విషయాలపై ఆదర్శ రైతు లైన యారం లక్ష్మీరెడ్డి, మేడిపల్లి ఉదయ్‌తో కలిసి వివరించారు.

February 22, 2026 / 09:15 AM IST

రాష్ట్రస్థాయి పోటీల్లో కమాన్‌పూర్ విద్యార్థినికి బంగారు పతకం

PDPL: రాష్ట్రస్థాయి పోటీల్లో కమాన్‌పూర్ విద్యార్థిని బంగారు పతకం సాధించింది. హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలో కమాన్‌పూర్ మండలానికి చెందిన నల్లవెల్లి ఆనంది 18 ఏళ్ల విభాగం 400 మీటర్ల పరుగులో బంగారు పతకం సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెను పలువురు అభినందించారు.

February 22, 2026 / 09:13 AM IST

ఈనెల 23న కేంద్ర బృందం పర్యటన.. కలెక్టర్ సూచనలు

జనగామ జిల్లా ఐదు పైలట్ జిల్లాల్లో ఒకటిగా ఎంపిక కావడం సంతోషకరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. RPRP కింద అమలవుతున్న 46 కేంద్ర ప్రభుత్వ పథకాల సమగ్ర తనిఖీ కోసం ఈ నెల 23న కేంద్ర బృందం జిల్లా పర్యటన జరగనుంది. కలెక్టర్ అధికారులు అన్ని కేంద్ర పథకాల అమలు వివరాలు, లబ్ధిదారుల సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు.

February 22, 2026 / 09:12 AM IST

మార్చి 14 నుంచి SSC పరీక్షలు

KNR: మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని, తాగునీరు, విద్యుత్, బెంచీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

February 22, 2026 / 09:11 AM IST

నేడు ఓలాకు గోషామహల్ ఎమ్మెల్యే రాక

NRML: కుంటాల మండలం ఓలా గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు విగ్రహ కమిటీ సభ్యులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కావున హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

February 22, 2026 / 09:10 AM IST

నేటితో ముగియనున్న ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు

MBNR: జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనున్నట్లు డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రూప్ 1, 2, 3, 4తో పాటు ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నట్లు ఆయన వెల్లిడించారు.

February 22, 2026 / 09:10 AM IST

జిల్లాలో నేటి చికెన్ ధరలు ఎంతంటే..

KMM: ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గింది. దీంతో చికెన్ షాప్ దగ్గర వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.

February 22, 2026 / 09:08 AM IST

బీజేపీ విధానాలపై పోరు: సీపీఎం

GDWL: కేంద్రంలోని BJP ప్రభుత్వం పార్లమెంటులో ఏకపాత్రాభినయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తాలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను కాలరాస్తూ తెచ్చిన లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి నిర్వహించే ప్రచార క్యాంపెయిన్ ఉంటుందన్నారు.

February 22, 2026 / 09:07 AM IST

నామినేటెడ్ పదవుల కోసం నేతల ఎదురు చూపు

VKB: కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితిలో నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మైనార్టీ నేత యూసుఫ్, బొంరాస్ పేట్ రాజేష్ రెడ్డి తదితరులకు పదవులు కేటాయించబడినప్పటికీ, యువజన కాంగ్రెస్ నేత కృష్ణంరాజుకు ఇంకా నియమిత పదవీ కోసం వేచిచూస్తున్నారు.

February 22, 2026 / 09:06 AM IST