KNR: గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శంకరపట్నం మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ సూచించారు. తాడికల్ రైతు వేదికలో MPO ప్రభాకర్ అధ్యక్షతన 9 గ్రామాల నూతన వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న 2వ రోజు ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల జ్వరం వస్తుందన్నారు.
SRD: ప్రపంచానికి మేధావులను తయారు చేసే హైదరాబాద్ (కంది) IIT యూనియన్ ఎన్నికలలో సీఐటీయు నాయకుడు అతిమేల మాణిక్‌ను ఎన్నుకోవడం గర్వకారణంగా ఉన్నదని CITU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రాజయ్య అన్నారు. సీఐటీయు అంటే కేవలం కార్మికుల సమస్యలు కాకుండా అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారానికి పోరాటం చేసే సంస్థ CITU అని అన్నారు.
ADB: లోకారి గ్రామం నుంచి గాదిగూడ మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తయినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు వాపోతున్నారు. చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్ల నుంచి ప్రయాణిస్తే ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో అని రాకపోకలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
KMR: అర్హులైన మైనార్టీ లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమంపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, తదితరులు పాల్గొన్నారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందున్నారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి HYD వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి మంగళవారం ఆడిటర్లతో కలిసి సమీక్షించారు. గ్రామంలో జరుగుతున్న పనుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్, ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
KMM: రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తదితరులు పాల్గొన్నారు.
MNCL: జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని తెలిపారు.
SRPT: HNRలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లైసెన్స్ డ్రైవర్ల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు SI తెలిపారు. మంగళవారం ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ చరమందరాజు పరిశీలించారు. డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేస్తామని అధికారులు తెలిపారు.
BHNG: భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హాజరయ్యారు.
WGL: నర్సంపేట డివిజన్ పరిధిలో రైతులు దరఖాస్తు చేసుకున్న సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి వెంటనే అమలు చేయాలని కోరుతూ ఇవాళ ఆర్డీవో ఉషారాణికి BJP పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా BJP జిల్లా కార్యదర్శి డా. రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కోరారు.
NZB: కమ్మర్పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతం నుంచి చౌట్పల్లి గ్రామానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను అధికారులు పట్టుకున్నారు. వాసంగట్టు తండాకు చెందిన లకావత్ రాజేందర్‌ను మంగళవారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్లు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.
NRML: లోకేశ్వరం మండలం పిప్రి గ్రామం లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ. 77 కోట్ల నిధులు మంజూరైనట్లు ముధోల్ MLA రామారావు తెలిపారు. ఈ లిఫ్ట్ ద్వారా పిప్రీ, నగర్, రాయపూర్ కాండ్లీతో పాటు పలు గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష వైఖరి మూలంగా రైతులకు అన్యాయం జరిగిందన్నారు. వచ్చే జూన్ వరకు ఈ లిప్ ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
KMM: అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తిర్లాపురం సర్పంచ్ వీరబాబు డిమాండ్ చేశారు. సోమవారం కురిసిన వర్షానికి మండలంలోని మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత రైతులకు ఎకరాకు రూ. 40వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.