• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రేపు ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు

BHPL: రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ ఛైర్మన్ NSR ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రత్యేక అభిషేకంతో వేడుకలు ప్రారంభం కానున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

February 25, 2026 / 03:25 PM IST

మహా నగరానికి ‘ఆరెంజ్ అలర్ట్’

HYD: నగరంలో వాతావరణం మారిపోయింది. బుధవారం ఉదయం భానుడు ప్రతాపం చూపినప్పటికీ మధ్యాహ్నానికి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరానికి వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఉష్ణోగ్రత 29°Cగా నమోదైనట్లు తెలిపింది. సాయంత్రం వేళ వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది.

February 25, 2026 / 03:20 PM IST

భక్తి మార్గంలో పయనించాలి: MLA

ADB: చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని MLA అనిల్ జాదవ్ కోరారు. గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన బోగ్ బండార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్థానికులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.

February 25, 2026 / 03:20 PM IST

గ్రామాలలో ఎఫ్ఎల్ఎన్ సర్వే

MNCL: లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం, వెంకట్రావుపేట, చందారం గ్రామాలలో రెండో తరగతి విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ అసైన్మెంట్ సర్వేను నిర్వహించారు. బుధవారం ఫీల్డ్ విజిటర్లు ఆయా గ్రామాలలో పర్యటించి సర్వేను చేపట్టారు. కార్యక్రమంలో వెంకట్రావుపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయురాలు శ్రీదేవి, సిఆర్పి విద్య, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు ఉన్నారు.

February 25, 2026 / 03:20 PM IST

‘జిల్లాలో ఇంటర్ పరీక్షకు 97 శాతం హాజరు’

PDPL: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం మొదటి రోజు పరీక్షకు 97 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. మొత్తం 5419 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 5271 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. 148 మంది గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

February 25, 2026 / 03:19 PM IST

అధ్వానంగా ఏకమామిడి రహదారి

VKB: ఏకమామిడి గ్రామ రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. కంకర తేలిన రోడ్డుపై వాహనాలు వెళ్లే సమయంలో విపరీతమైన దుమ్ము లేస్తోంది. దీనివల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవ్వడమే కాకుండా స్థానికులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలమయమైన ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

February 25, 2026 / 03:19 PM IST

మొదటిరోజు ఎందరు హాజరయ్యారంటే..?

VKB: తాండూరులో ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఇవాళ 2,553 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 57 మంది గైర్హాజరైనట్లు కస్టోడియన్లు మల్లినాథప్ప, కృష్ణయ్య తెలిపారు. మిగతా 2,496 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. జనరల్ విభాగంలో 1,969 మందిలో 33 మంది గైర్హాజరుతో 1,936 మంది పరీక్షలు రాశారు.

February 25, 2026 / 03:18 PM IST

పారిశుధ్య పనులను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య నగరంలోని అల్లిపురం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ (UGD) పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత, మన్నిక విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

February 25, 2026 / 03:18 PM IST

గుండెపోటుతో రైతు మృతి

KNR: జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గుజ్జ గోపాలరావు (45) తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి నీటి పరిస్థితిని పరిశీలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ క్రమంలో పొలంలోనే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వెళ్లేసరికే ప్రాణాలు వదిలాడు.

February 25, 2026 / 03:15 PM IST

కమ్యూనిష్టు పార్టీ వందేళ్ల సభ పోస్టర్లు విడుదల

MNCL: ఈ నెల 27న హైదారాబాద్‌లో జరిగే కమ్యూనిష్టు పార్టీ వందేళ్ల సభ పోస్టర్లను మంగళవారం శ్రీరాంపూర్‌లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కోల్ బెల్ట్ కార్యదర్శి బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన భూమి, భుక్తి, దేశ విముక్తి 1946- 51 వరకు తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిష్టు పార్టీ సాయుధ పోరాటం సాగించిందని తెలిపారు.

February 25, 2026 / 03:10 PM IST

సమస్యలు పరిష్కరించాలని వినతి

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో BRS కౌన్సిలర్లు బుధవారం మున్సిపల్ కమిషనర్ తిరుపతికి మెమరాండం అందజేశారు. వార్డులలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటుతో, మంచినీటి ఇంటర్ కనెక్షన్లు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ పేర్కొన్నారు.

February 25, 2026 / 03:10 PM IST

నాయకులుగా కాకుండా సేవకులుగా పనిచేయాలి: మంత్రి

JGL: నూతన పాలకవర్గం ప్రజలు ఇచ్చిన అధికారంతో ఎవ్వరిని ఇబ్బందులకు గురి చేయవద్దని, నాయకులుగా కాకండా సేవకులుగా పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. ధర్మపురి మున్సిపల్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 15 వార్డుల్లో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్నారు.

February 25, 2026 / 03:10 PM IST

న్యాయవాద రక్షణ చట్టం అమలుకై పాదయాత్ర

RR: న్యాయవాద రక్షణ చట్టం అమలు కోసం ఆలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రకు చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. న్యాయవాదులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేయాలనే దృఢ సంకల్పంతో న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

February 25, 2026 / 03:09 PM IST

మాడుగులపల్లి PS పరిధిలో “అరైవ్ అలైవ్”

NLG: మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. దూరం, సమీప, కలర్ విజన్, కంటి ఒత్తిడి పరీక్షలు నిర్వహించి, నైట్ విజన్ సమస్యలపై సూచనలు చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ..“డ్రైవర్‌కు కంటి చూపు స్పష్టంగా ఉండకపోతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు.

February 25, 2026 / 03:05 PM IST

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్

NZB: విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వండి పెట్టాలని వర్ని మండలం పైడిమల్ సర్పంచ్ అనూష చిరంజీవి సూచించారు. బుధవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రోజువారీగా విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలని సూచించారు.

February 25, 2026 / 03:05 PM IST