• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా: పసుపులేటి వీరబాబు

BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 21వ వార్డు కార్పొరేటర్ అధ్యక్షతన సుజాతనగర్‌లో నాయకులతో కలిసి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గ్రంథాలయానికి కావలసిన మౌలిక వసతులపై చర్చించారు. జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొని మండల ప్రజల సహకారంతో త్వరలోనే గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 03:57 PM IST

ప్రజావాణిలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..?

KNR: ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి వెను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్‌తో కలిసి 367 దరఖాస్తులు స్వీకరించారు.

February 23, 2026 / 03:51 PM IST

మార్చి 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు

WNP: మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం వనపర్తి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ప్రతిరోజు వార్షిక పరీక్షలు కొనసాగుతాయన్నారు.

February 23, 2026 / 03:46 PM IST

మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో మహిళా గ్రామైక్య సంఘం నూతన భవన నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మేడారం వీర్ పాల్, ఎంపీడీవో సుమలత టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి మౌనిక, ఐకేపీ ఎపీఎం, మహిళా సంఘాల ప్రతినిధులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 03:44 PM IST

కాల్వ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌కు వినతి

SRCL: తంగళ్లపల్లి మండలంలోని కాలేశ్వరం ప్రాజెక్టు ఎల్‌ఎంసీ 11/6, 11/5, 11/4 కాల్వల పెండింగ్ పనులు తక్షణం పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మండల సర్పంచులు జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పుర్మాని రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో జ్యోతి అనిల్, అంచ శ్రీనివాస్ రెడ్డి, సాయికృష్ణ గౌడ్, పరశురాములు, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 03:43 PM IST

రేపు కుమ్మెరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాక

NGKL: నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామానికి మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రానున్నారు. ఇటీవల కులవివక్షకు గురైన బాధితులను ఆయన పరామర్శిస్తారని పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడనున్నారు.

February 23, 2026 / 03:42 PM IST

శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం

MDCL: అల్వాల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో సోమవారం 6వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి దేవతారాధన విశేష అభిషేకాలు చేసిన, ఆలయ కమిటీ సభ్యులు చివరి రోజు మంగళవారం మహా పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, సంప్రోక్షణ, తీర్థ ప్రసాద, మహా అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

February 23, 2026 / 03:41 PM IST

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన

MDK: నిజాంపేటలో నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం కార్యాలయం శిథిలావస్థకు చేరిన పెంకుటింట్లో కొనసాగుతున్న నేపథ్యంలో, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి దానం చేసిన స్థలాన్ని ఆయన సందర్శించారు. భవన నిర్మాణానికి సంబంధించి తక్షణమే నివేదికలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 03:41 PM IST

అభివృద్ధి పనులను ప్రారంభించిన సర్పంచ్

MHBD: కొత్తగూడ మండలకేంద్రంలో సోమవారం పలు అభివృద్ధి పనులను సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ కొబ్బరికాయను కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, చేసిన పనులు నాణ్యతతో ఉన్న సంవత్సరాల తరబడి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

February 23, 2026 / 03:40 PM IST

‘ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి’

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రజల నుంచి  నేరుగా ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు.

February 23, 2026 / 03:37 PM IST

పసిపాప మృతి ఘటనపై జాతీయ రహదారిపై ధర్నా

KNR: శంకరపట్నం మండలంలో నాగూర్ (కర్నూలు జిల్లా) కొమ్మెర గ్రామంలో జరిగిన పసిపాప మృతి ఘటనను నిరసిస్తూ మండల రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘం మండల అధ్యక్షుడు తాడిచెర్ల తిరుపతి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొనగా, రాస్తారోకోతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

February 23, 2026 / 03:35 PM IST

‘ఐలమ్మ పార్టీవదేహానికి మాజీ జడ్పీటీసీ నివాళి’

MHBD: తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల రామ్మూర్తి మాతృమూర్తి పయ్యావుల ఐలమ్మ (65) గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న తొర్రూరు మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ ఐలమ్మ పార్టీదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రాగడ సానుభూతి తెలిపారు.

February 23, 2026 / 03:34 PM IST

డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి: సీపీఎం

BDK: చర్ల మండల మేజర్ పంచాయతీ పరిధిలో రాజయ్య నగర్, సాయి నగర్, మధ్యలో గల డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని సోమవారం సీపీఎం పార్టీ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నేతలు మాట్లాడుతూ.. 2011 నుంచి సీపీఎం పార్టీ అధ్యర్యంలో అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని అనేకసార్లు అధికారులకు వినతులు అందించిన ప్రయోజనం లేదని మండిపడ్డారు.

February 23, 2026 / 03:34 PM IST

పెద్దయిపల్లిలో అభివృద్ధి పనుల ప్రారంభం

MBNR: బాలానగర్ మండలం పెద్దయిపల్లిలో రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, హైమాస్ట్ లైట్ల పనులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని, దశలవారీగా అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.

February 23, 2026 / 03:32 PM IST

‘పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి’

MDCL: అల్వాల్‌లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలనే ఉద్దేశంతో సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగిస్తామని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం హెచ్ఎం డబ్ల్యూ SSB అధికారులు ఈడి పంకజ, GM సునీల్‌లను కలిసి అల్వాల్ ప్రాంతానికి మంజూరైన పెండింగ్‌లో ఉన్న తాగునీరు, మురుగు కాలువల పనులపై విస్తృతంగా చర్చించారు.

February 23, 2026 / 03:29 PM IST