పసుపు బోర్డుపై ప్రకటన చేసి సీఎం కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యేలా వ్యవహరించారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో ఇందూరు లోక్ సభ నుంచి ధర్మపురి అర్వింద్ విజయాన్ని ఈజీ చేసి.. కవితకు షాక్ ఇచ్చారు.
Kavitha: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ఆరు, ఏడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటినుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీకి 50 రోజుల్లోపు ఎన్నిక జరిగే ఛాన్స్ ఉంది. తెలంగాణ గడ్డ మీద నిన్న అడుగిడిన ప్రధాని మోడీ కీలక వరాలు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీతోపాటు లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రసంగించారు. అందులో కీలకమైంది పసుపు బోర్డు ఏర్పాటు.. దీంతో ఇందూరులో మరోసారి బీజేపీ అభ్యర్థి గెలిపించడం.. కవితను ఓడించడం అనేది ప్రధాని ఆలోచన. ఓకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా.. మోడీ ప్రకటన చేశారు.
షాక్ ఇచ్చిన మోడీ
తెలంగాణలో మిగతా చోట్ల సీట్లను పెంచుకునే వ్యుహం రూపొందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక శాసనసభ్యుడు మాత్రమే గెలిచాడు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 4 చోట్ల విజయం సాధించింది. ఈ సారి ఆ స్థానాలను పెంచుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ సారి కాకున్నా.. వచ్చే 2029 జమిలీ ఎన్నికల సమయంలో అయినా తెలంగాణ అసెంబ్లీలో కమలం వికసించాలని అనుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధినేత కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. 105 మందితో దాదాపు మొత్తం జాబితా ఇచ్చేశారు. అందులో కూతురు కవిత పేరు లేదు. ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతుందని అంతా భావించారు. సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాల నేపథ్యంలో టికెట్ వీలు కాలేదు. ప్రస్తుతం కవిత ఎమ్మెల్సీగా ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ తప్పితి కొన్ని నెలలకు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు మరోసారి ఇందూరు (నిజామాబాద్) నుంచి పోటీకి దింపాలని అనుకున్నారు. ఇందులో మరో అంశానికి తావులేదు.
అంచనాలు తలకిందులు
కేసీఆర్ అంచనాలను ప్రధాని మోడీ తలకిందులు చేశారు. అవును.. గత ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో.. ఈ సారి ఎలాగైనా కవిత గెలుపు కోసం విశ్వ ప్రయత్నం చేయాలని అనుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన సమస్య.. పసుపు బోర్డు డిమాండ్.. ఇక్కడ పసుపు ప్రధాన పంట.. బోర్డు ఏర్పాటు చేస్తే పంట మార్కెటింగ్ ఈజీగా అవుతుందని.. రైతులకు లాభం జరుగుతుందని భావించారు. ఇప్పుడే కాదు 2006 నుంచి ఈ ప్రాంత రైతులు బోర్డు కోసం పట్టుబట్టారు. ఆ తర్వాత ఎన్నికల హామీగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విజయానికి కారణం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీనివ్వడమే.. బోర్డుపై ప్రకటన రాకపోవడంతో నియోజకవర్గంలో ఎక్కడ తిరిగిన రైతుల నుంచి నిరసన తప్పలేదు. అలా వెళ్లదీసుకుంటూ వచ్చారు.
అర్వింద్‌కు ప్లస్
ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.. బోర్డుపై ప్రకటన రాకపోవడంతో అదే ఇష్యూతో బీజేపీని ఎండగడుదామని సీఎం కేసీఆర్ భావించారు. కానీ గులాబీ బాస్ అంచనాలను మోడీ తలకిందులు చేశారు. పాలమూరు పర్యటనలో.. నిజామాబాద్ ప్రాంత రైతుల కలపై ప్రకటన చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేశారు. ఈ అనౌన్స్ మెంట్ బీజేపీకి పాజిటివ్ కానుంది. ధర్మపురి అర్వింద్ ఇక స్వేచ్చగా నియోజకవర్గంలో తిరిగే వీలుంది. ఇచ్చిన హామీని నేరవేర్చుకున్నానని చెప్పుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగే కవితకు ఎన్నికల ప్రచారాస్త్రం లేదు. బీజేపీ అవినీతి, రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని చెప్పొచ్చు.. కానీ బలమైన అంశం లేదు.
60 వేల ఎకరాల్లో పంట సాగు
నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా 60 వేల ఎకరాల్లో పసుపు పంట సాగు జరుగుతోంది. ఆ రైతుల కల నెరవేరితే.. కోరిక నెరవేర్చిన పార్టీకి పట్టం కడతారు. సో.. ఎన్నికలో బీజేపీకి ప్లస్ అవుతోంది. మోడీ అనుసరించిన వ్యుహాం బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చినట్టే అవుతోంది. మోడీ యాక్షన్‌కు కేసీఆర్ ఎలా రియాక్షన్ ఇస్తారో చూడాలీ. మోడీ ప్రకటనపై మంత్రులు స్పందించారు.. కానీ.. లోక్ సభ ఎన్నికల సమయం నాటికి ఎలా తిప్పి కొడతారనే అంశం ఉత్కంఠ రేపుతోంది.