mla seethakka:కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క (seethakka) పినపాక నియోజకవర్గంలో ఈ రోజు పర్యటించారు. గుండాల మండల కేంద్రానికి చెందిన ఎస్కే అజ్గార్ కూతురు వివాహాం, తాటి లక్ష్మయ్య కుమారుడు పెళ్లి, గామల పాటి సురేశ్ కూతురు సారీ ఫంక్షన్కు హాజరయ్యారు.
mla seethakka:కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క (seethakka) పినపాక నియోజకవర్గంలో ఈ రోజు పర్యటించారు. గుండాల మండల కేంద్రానికి చెందిన ఎస్కే అజ్గార్ కూతురు వివాహాం, తాటి లక్ష్మయ్య కుమారుడు పెళ్లి, గామల పాటి సురేశ్ కూతురు సారీ ఫంక్షన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించారు. నిండు, నూరుళ్లు చల్లగా ఉండాలని దీవించారు. సీతక్కతోపాటు (seethakka) పొంబోయిన ముత్తయ్య, దుర్గ, ఆజాద్, మధు, మల్లయ్య, హరినాథ్, పవన్, కృష్ణ, సాహెబ్, పాషా, రమేష్, ఎర్రయ్య, సారంగపాణి, చలపతి రావు, పొట్టయ్య రాంబాబు ఉన్నారు.
రేవంత్ రెడ్డి (revanth reddy) హాత్ సే హాత్ జోడో యాత్రలో సీతక్క పాల్గొంటున్నారు. సీతక్క (seethakka)- రేవంత్ రెడ్డికి అనుచరురాలు. వారిద్దరూ ఇదివరకే తెలుగుదేశం పార్టీలో (tdp) ఉన్నారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఆమె కూడా వచ్చారు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్రలో సీతక్క పాల్గొన్నారు. భూపాలపల్లి అంటేనే భూ పోరాటాలకు అడ్డా అని చెప్పారు. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్కు రేవంత్ రెడ్డితో కలిసి హాజరయ్యారు.
ఇటీవల బీఆర్ఎస్ సభలో కాంగ్రెస్ పార్టీని దూషించారని.. అక్కడ జై కాంగ్రెస్ అని నినదించిన గడ్డ భూపాలపల్లి అని సీతక్క తెలిపారు. భూ కబ్జాదారులను గ్రామాల్లోకి రాకుండా తరిమికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్యాయం జరిగితే ప్రశ్నించాలని సూచించారు. సీతక్క అంతకుముందు మావోయిస్టు పార్టీలో ఉండేవారు. తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయనకు రూ.10 వేల విలువగల షూ కూడా బహుకరించారు.