»Mlc Kavitha Reaches Delhi May Keep Monday Date With Ed
MLC Kavitha: నేడు ఈడీ ఎదుట హాజరవుతారా?
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharatha Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (mlc kalvakuntla Kavitha) ఢిల్లీ మద్యం కుంభకోణం (delhi liquor case) కేసులో నేడు ( మార్చి 20, సోమ వారం) ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
what is delhi liquor scam and what is kavitha role
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharatha Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (mlc kalvakuntla Kavitha) ఢిల్లీ మద్యం కుంభకోణం (delhi liquor case) కేసులో నేడు ( మార్చి 20, సోమ వారం) ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆది వారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భర్త అనిల్, సోదరుడు, ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు, తదితరులతో కలిసి కవిత ఢిల్లీకి చేరుకున్నారు. తుగ్లక్ రోడ్డులోని తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసానికి చేరుకున్నారు.
ఈ నెల 11వ తేదీన తొలిసారి ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. ఆ తర్వాత 16 వ తేదీన ఈడీ రెండోసారి విచారణకు పిలిచినప్పటికీ వివిధ కారణాలు చూపించి గైర్హాజరు అయ్యారు. తన తరపున న్యాయవాదిని పంపించారు. తాను ప్రత్యక్షంగా హాజరు కావాలా లేక ప్రతినిధులను పంపించాలా అనే విషయంపై నోటీసుల్లో స్పష్టత లేదని ఈడీకి లేఖ రాసి, దానిని సోమా భరత్ నేతృత్వంలోని న్యాయ నిపుణులు ఈడీ అధికారులకు 16 వ తేదీన అందించారు. దీంతో ఈడీ 20 వ తేదీన విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది.
కవిత మరోవైపు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. తాను మహిళను అయినందున తనను ఇంటి వద్ద విచారించాలంటూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ 24న విచారణకు రానుండగా.. ఆ తర్వాతే విచారణకు హాజరవుతానని ఈడీకి విజ్ఞప్తి చేశారు. అధికారులు నిరాకరించడంతో పాటు 20న విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్ళారు కవిత.
20వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో తన పిటిషన్పై ఈలోపే విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అయితే పిటిషన్ను విచారణకు స్వీకరించిన రోజే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సీజేఐ ధర్మాసనం తక్షణ విచారణకు కూడా నో చెప్పింది. 24నే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈలోగా ఈడీ అధికారులు సుప్రీం కోర్టులో కేవీయట్ పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదన వినకుండా తీర్పు ఇవ్వవద్దని కోరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కవిత విచారణకు హాజరు కావడం పైన ఉత్కంఠ నెలకొంది.