MLA Saidi reddy Counters to Kotam reddy : కోమటిరెడ్డి ఏ పార్టీ తనకే తెలీదు.. ఎమ్మెల్యే సైటర్లు..!
MLA Saidi reddy Counters to Kotam reddy : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హంగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆయన కామెంట్స్ కి ఒక్కొక్కరు రియాక్షన్స్ ఇస్తున్నారు. తాజాగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా.... కోమటిరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హంగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆయన కామెంట్స్ కి ఒక్కొక్కరు రియాక్షన్స్ ఇస్తున్నారు. తాజాగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా…. కోమటిరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏ పార్టో ఆయనకే తెలియదని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జై అంటూ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులతో కలిసి ఉంటారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో హంగూ అంటూ కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగానే ఉన్నాయని అన్నారు.
అన్న ఒక పార్టీ.. తమ్ముడు మరో పార్టీ అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పొద్దున లేస్తే ఏ పార్టీలో ఉంటారో వాళ్లకే తెలవదని.. ఇంతకీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏ పార్టీ.. ఎవ్వరికీ తెలియడం లేదన్నారు. వందకి వంద శాతం 100 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.