»Minister Ktr Lay Foundation Stone For Several Development Works
KTR ములుగులో బిజీ, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ములుగు జిల్లాలో వివిధ అభివృద్ది పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథొడ్ తదితరులు ఉన్నారు.
Minister KTR Lay Foundation Stone For Several Development Works
KTR: ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ములుగు జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా చేపట్టిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి మహమూద్ అలీతో కలిసి హెలికాప్టర్లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకున్నారు. కేటీఆర్ (KTR), మహమూద్ అలీకి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao), సత్యవతి రాథోడ్ (satyawathi rathode) వెల్ కం చెప్పారు.
డిగ్రీ కాలేజీ సమీపంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం, పక్కన రూ.38.50 కోట్లతో నిర్మించే జిల్లా పోలీసు కార్యాలయ భవనానికి మంత్రి కేటీఆర్ (KTR) శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయ భవనాలు, మోడల్ బస్టాండ్ కాంప్లెక్స్, సేవాలాల్ భవనాలకు శంకుప్థాపన చేశారు. కార్యక్రమంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (vinay bhaskar), ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి (palla rajeshwar reddy), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (srinivas reddy), ఎంపీ కవిత (kavitha), ఎమ్మెల్యే సీతక్క (seethakka) పాల్గొన్నారు.
— KTR, Former Minister (@MinisterKTR) June 7, 2023
ములుగు జిల్లా కేంద్రం నుంచి రామప్ప ఆలయానికి (ramappa temple) చేరుకుంటారు. రుద్రేశ్వర స్వామికి కేటీఆర్ (KTR) ప్రత్యేక పూజలు చేస్తారు. రామప్ప చెరువు గట్టు వద్ద తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను ప్రారంభిస్తారు. అక్కడినుంచి జిల్లా కేంద్రానకి చేరుకుని.. ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రూ.30 లక్షలతో నిర్మించే డిజిటల్ లైబ్రరీ, సమాచార పౌర సంబంధాల శాఖ సమావేశ మందిరానికి శంకుస్థాపన చేస్తారు. జిల్లా కేంద్రంలో రూ.2 కోట్లతో నిర్మించే సీసీ రోడ్లు, సాధన స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు.