»Metro Service Trip Has Been Decreased In This Route
HYD Metro ట్రిప్పుల్లో కోత.. ఏ రూట్లో, ఎందుకంటే..?
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ట్రిప్పుల్లో కోత విధిస్తున్నారు. 7 నిమిషాలకు వచ్చే మెట్రో సర్వీసు.. ఇప్పుడు 15 నుంచి 17 నిమిషాలకు వస్తోంది. ఫ్రీక్వెన్సీ లేకపోవడంతో తప్పడం లేదని మెట్రో అధికారులు చెబుతున్నారు.
Metro Service Trip Has Been Decreased in This Route
HYD Metro: హైదరాబాద్ మెట్రోకు (HYD Metro) ఆదరణ ఎక్కువ. కానీ అన్నీ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఉండదు. హైటెక్ సిటీ, మాదాపూర్ (madhapur) రూట్, ఇతర మార్గాల్లో హాట్ కేక్.. ఎప్పుడూ రద్దీ ఉంటుంది. మిగతా రూట్లలో కాస్త తక్కువ.. ఇక జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన ఉండదు. ఈ రూట్లలో బస్సులు, ఆటోలు ఎక్కువగా ఉపయోగిస్తారు. సో.. అందుకే మెట్రో సేవలను అంతగా వాడరు.
తగ్గిన ట్రిప్పులు
జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో ప్రయాణికులు రావడం లేదు. దీంతో ట్రిప్పులను (trips) తగ్గించుకుంటూ వస్తున్నారు. స్టార్టింగ్ 7 నిమిషాలకు ఓ సర్వీస్ (service) నడిపారు. ప్యాసెంజర్స్ అంతగా రాకపోవడంతో దానిని 12 నిమిషాలకు ఓ సర్వీస్ (metro service) వేశారు. తర్వాత దానిని 15 నిమిషాలు చేశారు. ఒక్కోసారి 17 నిమిషాలకు ఓ సర్వీస్ వస్తోందని కొందరు ప్రయాణికులు అంటున్నారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో 8 స్టేషన్లు ఉంటాయి. ఏ స్టాఫ్ అయినా సరే రూ.15 ఛార్జీ తీసుకుంటారు.
ఆదరణ లేదు
ఈ రూట్లో మెట్రోకు (metro) ఆదరణ అంతగా లేకపోవడంతో ఛార్జీని సగానికి పైగా తగ్గించారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో మెట్రో రైలు వచ్చే సమయాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఈ రోజు నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్నాయి. ప్యాసెంజర్స్ సంఖ్య పెరగొచ్చు.. 8 నుంచి 10 నిమిషాలకు ఒక ట్రిప్ నడిపితే బాగుంటుందని కొందరు ప్రయాణికులు కోరుతున్నారు.
మరో సమస్య
మెట్రో సర్వీస్ తగ్గించడంతో మరో సమస్య ఉంది. మూసాపేట నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్లేందుకు ఓ ప్యాసెంజర్ మెట్రో ఎక్కారు. పరేడ్ గ్రౌండ్ స్టేషన్లో దిగి.. పక్కనే గల జేబీఎస్‌కు మెట్రోకి చేరుకున్నారు. అప్పటికే ఎంజీబీఎస్‌కు వెళ్లే మెట్రో వెళ్లిపోయింది.. దీంతో మరో సర్వీస్ వచ్చే వరకు 15 నుంచి 17 నిమిషాలు ఆగాల్సి వచ్చింది. రెడ్ లైన్, బ్లూ లైన్ నుంచి గ్రీన్ లైన్లో ప్రయాణించే వారికి అనుసంధాన సమస్యలు వస్తున్నాయి. దీనిని కూడా పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.