తెలంగాణ(Telangana)లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కూడా. ఈ నేపథ్యంలో.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంత్రి హైదరాబాద్ (Hyderabad) లో హంగామా చేశారు. ఓ పెళ్లికి ముఖ్య అతిథిగా హాజరై.. నోట్ల వర్షం కురిపించారు. దీంతో.. ఆ పెళ్లి మండపంలో కుప్పలు కుప్పలుగా డబ్బు పేరుకుపోయింది. ఆ మంత్రి శివానంద పాటిల్ (Minister Sivananda Patil) వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి పాల్గొన్న వివాహ వేడుకలో కరెన్సీ నోట్లను వినోదానికి ఉపయోగించినట్టు ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో అది వివాదంగా మారింది. శివానంద పాటిల్ కర్ణాటక (Karnataka) రాష్ట్ర చెరకు సాగు అభివృద్ధి మంత్రిగా ఉన్నారు.
గుల్బర్గా కాంగ్రెస్ నేత అయాజ్ ఖాన్ కుమారుడికి, హైదరాబాద్ కు చెందిన వ్యాపారి, రెడ్ రోజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సయ్యద్ హమీద్ ఉద్దీన్ కుమార్తెతో వివాహం జరిగింది. ఈ వివాహ వేడుక నగరంలో జరిగింది. ఈ పెళ్లి వేడుకకు శివానంద పాటిల్ తో పాటు మరికొందరు కర్ణాటక మంత్రులు కూడా హాజరయ్యారు. సోఫాలో పాటిల్ కూర్చోగా, ఆయన చుట్టూ కరెన్సీ నోట్లు, పాదాల వద్ద కూడా ఉండడాన్ని గమనించొచ్చు. ఆయన ముందు కొందరు యువత గాల్లోకి రూ.500 నోట్లు వెదజల్లుతూ పెళ్లిలో సంబరాలు చేసుకున్నారు. పెళ్లి మండపం అంతా నోట్లతో నిండిపోయింది. దీనిపై బీజేపీ (BJP) ,బీఆర్ఎస్ విమర్శలు చేశాయి.
‘ప్రజల నుంచి దోచుకున్న డబ్బును మంత్రులు ఎలా ఆనందిస్తున్నారో చెరకు మంత్రి చక్కగా చూపించారు’’ అంటూ కర్ణాటక బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిల్ పై పోస్ట్ చేసింది. దీనిపై పాటిల్ స్పందించారు. తానేమీ నోట్లను వెదజల్లలేదంటూ, పెళ్లి కార్యక్రమంలో అది చోటు చేసుకున్నట్టు చెప్పారు. పాటిల్ గత నెలలోనూ తన వ్యాఖ్యలతో వివాదం కొనితెచ్చుకున్నారు. మెరుగైన పరిహారం వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగినట్టు వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఇలా యథేచ్చగా డబ్బులు వెదజల్లటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే.. అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ(Congress party)పై పలు కీలక ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున డబ్బు తెలంగాణకు వస్తుందని.. ఆరోపిస్తున్నారు.
BJP slammed Karnataka Minister Shivanand Patil after a video clip of currency notes being showered at a private function attended by him in Telangana went viral on social media. BJP demanded a detailed probe into the source of the money that was showered on the minister’s program pic.twitter.com/Gy48ohWtJl