Jangaon Ticket Politics: Aapko Ex Chairman Mandala Sriramulu prostration To CM KCR Flex
Jangaon Ticket Politics: జనగామ అసెంబ్లీ టికెట్ అధికార పార్టీలో హీటు పెంచుతోంది. టికెట్‌పై గొడవ ఉండటంతో తెలివిగా సీఎం కేసీఆర్ (cm kcr) ఆపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై వ్యతిరేకత.. దీంతో పళ్లా రాజేశ్వర్ రెడ్డి (palla rajeshwar reddy) రంగంలోకి దిగారు. తనకే టికెట్ అంటూ ప్రచారం చేయించుకున్నారని ముత్తిరెడ్డి అంటున్నారు. ఎందుకీలా చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (pochampally srinivasa reddy) కూడా టికెట్ కోసం తన శక్తి మేరకు ట్రై చేస్తున్నారు. స్థానికుడిని, తనకే టికెట్ ఇవ్వాలని ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు (mandala sri ramulu) కోరుతున్నారు.
ఇలా జనగామ టికెట్ (Jangaon Ticket) కోసం అధికార బీఆర్ఎస్ పార్టీలో పోటి ఉంది. నలుగురు అభ్యర్థులు టికెట్ కావాలని పట్టు బడుతున్నారు. మండల శ్రీరాములు (mandala sri ramulu) అయితే ఏకంగా సీఎం కేసీఆర్ (cm kcr) ఫ్లెక్సీకి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ ఫోటో/ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. జనగామ టికెట్ కోసం ఇంత హైప్ ఉందా అనే చర్చ తెగ జరుగుతోంది.
స్థానికులు కాదు
పళ్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్థానికులు కాదని మండల శ్రీరాములు (mandala sri ramulu) అంటున్నారు. జనగామలో ఆదివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. పళ్లా, పోచంపల్లికి ఇంకా ఎమ్మెల్సీగా సమయం ఉందని గుర్తుచేశారు. అయినప్పటికీ ఎమ్మెల్యే కావాలి అనుకుంటే.. సొంత నియోజకవర్గం నుంచి ప్రయత్నించాలని కోరారు. తనకు టికెట్ ఇవ్వాలని బీసీలు కోరుకుంటున్నారని కేసీఆర్ ప్లెక్సీకి శ్రీరాములు (sri ramulu) సాష్టాంగ నమస్కారం చేశారు. తన మొర అలకించాలని వేడుకున్నారు.
పళ్లాకే ఖాయం..?
జనగామలో ముత్తిరెడ్డిపై వ్యతిరేకత ఉంది.. ఇంతలో పళ్లా (palla) తనకే టికెట్ అంటున్నారు. సీఎం కేసీఆర్‌కు (cm kcr) దగ్గరగా ఉండటంతో.. ఆయనను కాదనరని రాజకీయ విశ్లేషకుల భావన. పోచంపల్లి ట్రై చేసినప్పటికీ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. సో.. తాను కూడా రేసులో ఉన్నానని మండల శ్రీరాములు (sri ramulu) అంటున్నారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు.