తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది.తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం.. కార్యాలయాల్లో ఈ తెల్లవారు జాము నుంచి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డితో పాటుగా ఆయన సోదరులు, కుమారుడు – అల్లుడి ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఒకే సారి 50 టీంలు ఈ దాడులు మొదలు పెట్టాయి. సికింద్రాబాద్.. కొంపల్లిలో ఐటీ అధికారులు ఒకే సమయంలో ఈ దాడులు మొదలు పెట్టారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో కుటుంబ సభ్యులు పలు హోదాల్లో కొనసాగుతున్నారు.
కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలోల పెద్ద సంఖ్యలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టీంలుగా విడిపోయిన ఐటీ అధికారులు పక్కా ప్రణాళికా ప్రకారం సోదాలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కుమారుడు – అల్లుడు పలు రియట్ ఎస్టేట్ సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టారు. దీంతో వారితో పాటుగా నగరంలోని పలువరు ప్రముఖుల నివాసాల్లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నట్లుగా సమాచారం.
ఈ దాడులతో ఇప్పుడు రాజకీయ కలకలం మొదలైంది. హైదరాబాద్ కు చెందిన పలువురు ప్రముఖుల నివసాలతో పాటుగా కార్యాలయాల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో, ఐటీ అధికారులు ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు.. ఏం జరుగుతోందనే ఉత్కంఠ మొదలైంది.