»If Congress And Bjp Come Cm For One Year Scam Guarantee For One Month Minister Ktr
Telangana: కాంగ్రెస్, బీజేపీలు వస్తే ఏడాదికొక సీఎం, నెలకొక స్కామ్ గ్యారంటీ : మంత్రి కేటీఆర్
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్, బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. మోదీ ఏం చేశారని తెలంగాణ వచ్చి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే స్కామ్‌లు జరగడం ఖాయమన్నారు.
కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత హామీలను నమ్మొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరు దశాబ్దాల్లో ఏమీ చేయనివారు 6 గ్యారెంటీలతో ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ (Congress) నేతలు నోటికొచ్చినట్లుగా వాగ్దానాలు ఇస్తున్నారన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా (Manchiryala District) రామకృష్ణాపురంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటించి ప్రజలకు తన సందేశాన్ని వినిపించారు.
మంచిర్యాలలోని బహిరంగ సభలో కేటీఆర్ (KTR) ప్రసంగిస్తూ..ప్రజలు ఆలోచించాలని, ఆగం కావొద్దని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఉందని, 60 ఏళ్లలో చేయని పనిని తాము పదేళ్లలోనే చేసి చూపించామన్నారు. పామాయిల్ పంటను ప్రోత్సహిస్తున్నామన్నారు. 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ వేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని, చెన్నూరు ఎత్తిపోతలను పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణకు ఏం చేయని మోదీ నేడు రాష్ట్రానికి ఏ మొహంతో వచ్చారన్నారు. ప్రధాని మోదీ (Pm Modi) ఉన్న ఆస్తులనే అమ్ముతున్నారని విమర్శలు గుప్పించారు. సింగరేణి (singareni) గనులను ప్రైవేటు పరం చేశారన్నారు. సింగరేణిని కాపాడుతానని మాటిచ్చిన నెలలోనే గనుల ప్రైవేటీకరణకు (Privatisation) వేలంపాటకు రావాలని పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు.
గుజరాత్ (Gujarath) బుద్ది తమకు నేర్పొద్దని, రూ.37,000 కోట్లు రుణమాఫీ చేసిన ఏకైక సీఎం కేసీఆర్ (CM KCR) అని అన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు తమ కుటుంబమేనన్నారు. బీజేపీకి నూకలు చెల్లాయన్నారు. బీజేపీకి బుద్దిచెప్పే బాధ్యత తెలంగాణ ప్రజలు తీసుకుంటారన్నారు. నేడు మహబూబ్ నగర్ పర్యటనలో పీఎం మోదీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. ప్రజలు కేసీఆర్‌ను గెలిపిస్తే బీజేపీకి కుళ్లు అని, కేసీఆర్ పాలనలో ప్రజంతా సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలో వస్తే ఏడాదికొక సీఎం, నెలకొక స్కామ్ గ్యారెంటీగా జరుగుతుందన్నారు.