SDPT: దుబ్బాక మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు దుబ్బాక మండలంలో 23.50% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.