MBNR: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక బ్రహ్మ మానసిక ఆరోగ్య శిబిరంలో జిల్లా న్యాయ సేవా సమితి సభ్యురాలు ఇందిర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషీ మానసికంగా ఒత్తిడితో జీవిస్తున్నాడని, మానసిక ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తల్లిదండ్రులతోపాటు పిల్లల మనోవిషయాలు తెలుసుకున్నారు.