KNR: లంబాడిపల్లి గ్రామ నూతన సర్పంచిగా కాటం సంపత్ రెడ్డి, ఉప సర్పంచ్‌గా నక్క ఓదెలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వార్డు సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.