ADB: విద్యార్థులు జీవితంలో ఉన్నతమైన స్థానాలను అధిరోహించాలని అదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ , కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అన్నారు. రాష్ట్రస్థాయిలో అథ్లెటిక్స్‌లో సత్తా చాటి క్రీడాకారుల రిఫరీలుగా నియమితులైన వసంత జ్యోతిలను శనివారం పుష్పగుచ్చాలతో అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, చంద్రకాంత్, సిబ్బంది ఉన్నారు.