MNCL: లక్షెట్టిపేటలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ముందు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వారు శనివారం హాస్టల్ ముందు ధర్నా చేసి డీడీ పురుషోత్తంకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఉపాధ్యక్షులు శ్రీకాంత్, యుఎస్ ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి ఉన్నారు.