NGKL: అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో ఈనెల 10న మూడవ విడత మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు శనివారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. శస్త్రచికిత్సల కోసం పేర్లు నమోదు చేసుకున్న వారు 9వ తేదీన ఆసుపత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. 10వ తేదీన శస్త్రచికిత్సలు జరుగుతాయని ఆయన చెప్పారు.