GNTR: తెనాలిలోని 13వ వార్డు, మల్లాదివారి వీధిలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ ఛైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు. రూ. 13.25 లక్షల అంచనా వ్యయంతో 135 మీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కోటేశ్వరరావు, సంజీవరెడ్డి, మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్, డీఈ. శ్రీకాంతులు పాల్గొన్నారు.