WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని నారకపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దండం రవీందర్ ఇవాళ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక వృద్ధుడిని కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రజలు అందరూ బ్యాట్ గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరారు.