NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 75,394 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 21 వరద గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ, ఎస్కేప్ గేట్లు, సరస్వతి కాలువ, మిషన్ భగీరథ ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు.