ASF: జిల్లాలో దసరా వేడుకలను గురువారం ప్రజలందరూ ఆనందోత్సవాల నడుమ ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా సహకరించాలని కోరారు. అలాగే పట్టణంలో ఉత్సవం జరుగు సమయంలో పిల్లలకి ద్విచక్ర వాహనాలు ఇచ్చి రోడ్డు మీదికి పంపవద్దని ఎస్పీ హెచ్చరించారు.