ADB: నార్నూర్ మండలం మాన్కపూర్ గ్రామంలోని గల పశువుల తొట్టె పిచ్చిమొక్కలతో దర్శనమిస్తుంది. రోజు అదే మార్గంలో ప్రయాణిస్తున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. వేసవి కాలం నేపథ్యంలో పశువులు నీరు తాగే నీటి తొట్టెను ప్రారంభించకుంటే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికారులు నీటి తొట్టెను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.