HYDలో జనగణన ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మూడు వారాలైనా, కేవలం 66 శాతం ఎన్యూమరేటర్లు మాత్రమే విధుల్లో చేరగా, యాప్ సాంకేతిక సమస్యలు సర్వేను మరింత ఆలస్యం చేస్తున్నాయి. ఇళ్ల వివరాలు సర్వర్‌కు చేరకపోవడం, లాగిన్ సమస్యలు, సిబ్బంది కొరతతో జనగణన లక్ష్యాలపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. ప్రజల వివరాలు సరిగ్గా నమోదు చేయాలని కోరుతున్నారు.