SRPT: కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం వేయించడం మోటార్ వాహన చట్టరీత్యా నేరమని, మోతే ఎస్సై అజయ్‌కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం మోతే మండల పరిధిలోని జాతీయ రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బ్లాక్ ఫిలిం వాడుతున్న కార్లను గుర్తించి, వాటిని తొలగించే చర్యలు తీసుకున్నామన్నారు.