MHBD: పెద్దవంగర మండలం గంట్లకుంట తండా శివారు రామోజీ తండాలోని అంగన్వాడి కేంద్రం చుట్టూ మురుగు నీరు నిలిచిపోయింది. దీంతో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్వాడి కేంద్రం చుట్టూ నీరు నిలవకుండా పనులు చేపట్టాలని కోరుతున్నారు.