MHBD: మాజీ సర్పంచులకు చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని జిల్లా సర్పంచ్లు ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ లక్ష్మణ్ నాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, మాజీ సర్పంచులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు.