కామారెడ్డి: బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణిలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లకుండా బిచ్కుందలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు విన్నవించవచ్చన్నారు.