MNCL: ఆర్టీసీ బస్సులలో క్యూ ఆర్ స్కానర్లు రావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, నిర్మల్, ఉట్నూర్, ఆదిలాబాద్, మంచిర్యాల డిపోల బస్సులలో అధికారులు క్యూఆర్ స్కానర్లను ప్రవేశపెట్టారు. ప్రయాణికులు ఆ స్కానర్లను స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తూ ఉండడంతో కండక్టర్లు టికెట్లు జారీ చేస్తున్నారు. దీంతో చిల్లర సమస్య కూడా తీరిందని కండక్టర్లు తెలిపారు.