KMR: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల సర్పంచ్ పటేల్ సాయిలు నిలబెట్టుకున్నారు. గ్రామానికి చెందిన అంధుడైన రమేష్‌కు ప్రతి నెలా తన సొంత డబ్బుల నుంచి రూ. 2 వేల పింఛన్ ఇస్తానని మాట ఇచ్చిన ఆయన, ఆదివారం ఆ మొత్తాన్ని పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి పింఛన్ మంజూరయ్యే వరకు ఈ సాయం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.