సంగారెడ్డి: జిల్లా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని పలు చర్చలకు పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ క్రిస్మస్ కేకులను మంగళవారం పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చి పాస్టర్లకు కేకులను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.