NRML: తెలంగాణ BJLP నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి అంశంపై చర్చించి, రహదారుల అభివృద్ధికి కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. నిధుల మంజూరు విషయంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.