NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 7వ, 8వ, 16 వ వార్డులలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కల్వకుర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ శనివారం భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరు పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.