వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓసీటీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద క్రిస్టమస్ వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో వరంగల్ మేయర్ సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్య శారద, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రైస్తవ పాస్టర్లు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.