MNCL: శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి హాజీపూర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లవద్దని EE రవీంద్ర చారి ఆదివారం ప్రకటనలో హెచ్చరించారు. దిగువ ప్రాంతానికి 8 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసే అవకాశం ఉందన్నారు. చేపల వేటగాళ్లు, పశువుల కాపర్లు నదీ ప్రాంతాలకు వెళ్లవద్దన్నారు.