HYD: జీఎమ్ఆర్ హైదరాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని సాధించింది. ఇండియా అండ్ సౌత్ ఏషియా విభాగంలో ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్ 2025’ అవార్డు నాలుగోసారి అందుకుంది. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, అతిథి సేవలు, కార్యకలాపాల్లో సమర్థతకు గుర్తింపుగా అందించారు.