BHPL: సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేయడం సంప్రదాయమే అయినప్పటికీ, విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని భూపాలపల్లి S.E మాల్సూర్ నాయక్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో పతంగులు ఎగరవేయడం వల్ల ప్రాణాపాయం పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.