NRPT: ధన్వాడ పీఏసీఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు దళారీలను నమ్మి మోసపోకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి, అధికారులు పాల్గొన్నారు.