HYD: మైనర్ బాలుడు కారును అతివేగంగా నడిపి డివైడర్ను ఢీ కొట్టిన ఘటన జూబ్లీహిల్స్ PS పరిధిలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కారును బాలుడు (17) నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపాడు. ఈ ఘటనలో బాలుడు గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.