KMM: ముదిగొండ మండలం కమలాపురం గ్రామంలో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉపేందర్ (23) పొలం పనులకు వెళ్లి మృతి చెందినట్లు సమాచారం. మృతికి గల కారణాలపై స్పష్టత లేకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.