నిర్మల్ జిల్లా శివాజీ చౌక్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. నిర్మల్ నుంచి బైంసాకు వెళ్తుండగా ఎదురెదురుగా వచ్చిన రెండు ఆటోలు ఢీకొనగా, వెంటనే ఆయన తన వాహనాన్ని ఆపి ప్రమాదస్థలానికి చేరుకున్నారు. బోల్తా పడిన ఆటోలో చిక్కుకున్న ప్రయాణికులను స్వయంగా బయటకు తీశారు.