Rains: భారీ వర్షంతో (Rains) రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు నిండుకుండలా మారాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వరుణ దేవుడు విజృంభిస్తున్నాడు. మరో 3 రోజులు వర్ష బీభత్సం కొనసాగనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న కీలక సూచనలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. పొలాల్లో నీళ్లు నిలబడకుండా చూడాలని కోరారు. అలాగే పొలంలో ఉండేవారు మొబైల్ వాడొద్దని సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎలక్ట్రికల్ స్తంభాలు, చెట్ల కింద నిలబడొద్దని కోరారు.
పొలంలో ఉన్న సమయంలో నేలపై కూర్చొవాలని సూచించారు. అలాగే ఎత్తుగా నిలబడి ప్రయాణం చేయొద్దని సజెస్ట్ చేశారు. ఉరుములు, మెరుపుల వల్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రేపు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటన చేశారు.