MBNR: గండీడ్ మండలంలోని రంగారెడ్డిపల్లి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొని రామాంజి (48)అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బీఎస్ఎన్ఎల్ కేబుల్ పనులు ముగించుకొని నడుచుకుంటూ వెళుతున్న రామాంజిని, తాండూర్ వైపు వెళ్తున్న బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో అతడికి రెండు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు సమాచారం మేరకు 108 సిబ్బంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.