WGL: ఇల్లంద వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని ధాన్యం అమ్మిన వారికి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్వింటాలకు రూ. 500 రూపాయల బోనస్, మద్దతు ధర వస్తుందా లేదా అని ప్రతి ఒక్క రైతుని అడిగి తెలుసుకున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు.