WNP: ప్రజల సమస్యలకు పరిష్కారమార్గంచూపే బాధ్యత అధికారులపైనే ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కొత్తకోట, మదనాపురం మండలాల సమస్యలపై కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాలకు చెందిన పలువురు సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.