KNR: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సన్మానించారు. వేములవాడ బీజేపీ ఇంఛార్జ్ చెన్నమనేని వికాస్ రావు నేతృత్వంలో వారిని సన్మానించి అభినందించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలకపాత్ర పోషిస్తారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమర్థవంతమైన పాలన అందించాలని వారు సూచించారు.